సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రికి వినతి
నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆస్పత్రిలో రెగ్యులర్ వైద్యులను నియమించాలని, సౌకర్యాలు మెరుగుపర్చాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖ , జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు సర్పంచ్ ఇంద్రకరణ్ విన్నవించారు. హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. నిర్మల్, భైంసా పట్టణాలకు మధ్యలో ఉన్న నర్సాపూర్(జి) 61వ జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, క్షతగాత్రులను చికిత్స కోసం నిర్మల్, భైంసా ఆస్పత్రులకు తరలించడంతో వైద్యం ఆలస్యమవుతోందని వెల్లడించారు. 30 పడకల ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు, నిర్మల్ ఏఎంసీ చైర్మన్ సోమ భీంరెడ్డి, నాయకులు ఉమామహేశ్వర్, అజీమ్, ఫారూక్ పాల్గొన్నారు.


