యూనివర్సిటీస్థాయి పోటీలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
బాసర: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో రాణించి జాతీయస్థాయికి అర్హత సాధించారు. ఈ పోటీలు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి కేఎల్ యూనివర్సిటీలో జనవరి 3 నుంచి 6 వరకు నిర్వహిస్తారు. దేశంలోని ప్రము ఖ విశ్వవిద్యాలయాల క్రీడాకారులు ఇందులో పా ల్గొంటారు. జాతీయస్థాయికి ఎంపికై న యూనివర్సిటీ జట్టును ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ అభినందించారు. కార్యక్రమంలో, స్పోర్ట్స్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జి రామకృష్ణ, ఫిజికల్ డైరెక్టర్స్ శ్యాంబాబు, రవికిరణ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వసంత, స్వప్న పాల్గొన్నారు.


