కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు
నిర్మల్‌చైన్‌గేట్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కలెక్టర్ అభిలాష అభినవ్‌కు శుక్రవారం పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నోట్ పుస్తకాలు, పూల మొక్కలు, పుష్ప గుచ్ఛాలు అందించారు. కేక్‌లు కట్ చేశారు. పలు శాఖల, ఉద్యోగ సంఘాలకు చెందిన డైరీలు, క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికా రులు, ఉద్యోగులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అధికారులంతా ఉత్సాహంతో పనిచేస్తూ, జిల్లాను అన్నిరంగాలలో ముందు వరుసలో ఉంచాలన్నారు. కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, టీఎన్జీవో సంఘ నాయకులు, పలువురు మీడియా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


