రేషన్ దుకాణాల తనిఖీ
ఖానాపూర్: పట్టణంలోని శాంతినగర్, విద్యానగర్, భర్కత్‌పుర్, అంబేడ్కర్‌నగర్, సుభాష్ నగర్‌తోపాటు మండలంలోని తర్లపాడ్ గ్రామానికి చెందిన రేషన్ దుకాణాలను టాస్క్ ఫోర్స్ డీఎస్పీ శేఖర్‌రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ప్రతీ దుకాణాంలో లైసెన్స్, దుకాణం బోర్డులు అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీనెల సకాలంలో సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. అన్ని కేంద్రాల్లో విధిగా శుభ్రత పాటించాలన్నారు. తనిఖీ సమయంలో మూసిఉన్న డీలర్లను హెచ్చరించారు. పలుచోట్ల 4 నుంచి 6 కిలోల బియ్యం తేడా వచ్చిందని డీలర్లు తెలిపారు. లబ్ధిదారులు బియ్యాన్ని అమ్ముకోవద్దని తెలిపారు. ఆయన వెంట ఇన్‌చార్జి ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ కార్తీక్‌రెడ్డి ఉన్నారు.


