అంతర్జాతీయ పోటీలకు కేజీబీవీ విద్యార్థి
నిర్మల్ రూరల్: నిర్మల్ అర్బన్ కేజీబీవీ కళాశాలలో ఇంటర్ చదువుతున్న చాకలి నక్షత్ర కిక్ బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి అంతర్జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని ఎస్‌వో సుజాత తెలిపారు. ఖేలో ఇండియా గేమ్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన 65 కిలోల విభాగం పోటీల్లో నక్షత్ర ప్రతిభ కనబర్చి మూడోస్థానంలో నిలిచింది. కాంస్య పతకంతోపాటు రూ.4 వేల నగదు బహుమతి సాధించింది. మార్చి లో తమిళనాడులో నిర్వహించే అంతర్జాతీయ పోటీలకు ఎంపికై నట్లు ఎస్‌వో వివరించారు. ఉపాధ్యాయులు అభినందించారు.


