నిర్మల్
న్యూస్‌రీల్
పొగమంచు వాతావరణంలో వాహనాలపై వెళ్లేవారు తప్పనిసరిగా హెడ్‌లైట్ వేసుకునే వెళ్లాలి.
పరిమిత వేగంతో రోడ్డును సరిగా చూసుకుంటూ వాహనాన్ని డ్రైవ్ చేయాలి.
కారు, బస్సు, లారీల వంటి వాహనాల డ్రైవర్లు ముందటి అద్దం(విండ్ స్క్రీన్), సైడ్ మిర్రర్లపై మంచు పేరుకుపోకుండా వైపర్‌తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి.
రోడ్డు మొత్తానికే కనిపించకుండా ఉన్నట్లయితే వాహనాల్లో వెళ్లేవారు కాసేపు ప్రయాణం వాయిదా వేసుకోవడమే ఉత్తమం.
పొగమంచు వాతావరణం ఉన్నప్పుడు రోడ్డుపక్కన టీస్టాళ్లు, టిఫిన్ బండ్ల దగ్గర పార్కింగ్ చేసేటప్పుడు రహదారికి దూరంగా చేయాలి. రోడ్డుపక్కనే ఆపినట్లయితే కచ్చితంగా పార్కింగ్ లైట్లు వేయాలి.
పొంచిఉన్న.. పొగమంచు
అడవిలో వ్యూ లైన్స్
అడవుల్లో వన్యప్రాణులు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. వన్యప్రాణులు మృతిచెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు వ్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు.
‘అడెల్లి’కి పోటెత్తిన భక్తులు
సారంగపూర్: అడెల్లి శ్రీమహాపోచమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాతోపాటు పొరుగు జిల్లాలైన నిజమాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిర్మల్: జిల్లా కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు రమేశ్ మూడురోజుల క్రితం ఉదయం ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పాఠశాలకు బయలుదేరాడు. పొగమంచు కమ్ముకుని ఉండటంతో మెల్లగానే వెళ్తున్నాడు. మంజులాపూర్ దాటగానే వెనుక నుంచి మరో వాహనం వచ్చి ఢీకొట్టింది. దీంతో రమేశ్ కిందపడ్డాడు. అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. లేదంటే ప్రాణాలకే ప్రమాదంగా మారేది. ఈ ప్రమాదానికి పొగమంచే కారణం. ముందు వెళ్తున్న వాహనం కనిపించక ఇలా జరిగింది. ఐదు రోజులుగా జిల్లాను ఉదయం 10 గంటల వరకు పొగమంచు కమ్మేస్తోంది. దీంతో వాతావరణ శాఖ కూడా అలర్ట్ ప్రకటించింది. ప్రమాదాలతోపాటు అనారోగ్య సమస్యలూ పెరుగుతున్నాయి.
బారెడు పొద్దెక్కినా..
వాతావరణ మార్పులతో కొన్నిరోజులుగా జిల్లా మంచుదుప్పటి కప్పుకున్నట్లుగా ఉంటోంది. ఉదయం 9 గంటలు దాటినా మంచుతెర తొలగిపోవడం లేదు. వేకువజామున ఎదురుగా ఉన్న వాహ నం కూడా కనిపించడం లేదు. జాతీయ రహదారులపై మసక వెలుతురుతో కూరగాయలు, పాలు తీసుకువచ్చేవారికి, ఆర్టీసీ, స్కూల్ బస్సులకు, భారీ వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
వృద్ధులకు ఇబ్బందులు..
చలికాలం చిన్నారులు, వృద్ధులకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రధానంగా వృద్ధులకు పొగమంచు, చలి కారణంగా కఫం పెరుగుతుంది. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ రవి, ఎండీ ఫిజీషియన్, నిర్మల్
పిల్లలను బయటకు పంపొద్దు..
ఈసీజన్‌లో ఇప్పటికే చలి కారణంగా చిన్నారులు జలుబు, దగ్గులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పొగమంచు వాతావరణం ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. చిన్నపిల్లలను వీలైనంత వరకు బయటకు పంపించవద్దు.
– డాక్టర్ స్వప్న, చిన్నపిల్లల వైద్యురాలు, నిర్మల్
జాగ్రత్తలు తప్పనిసరి..
‘ఆహా.. ఎంతబాగుంది. పచ్చని చెట్లు, చెరువులు, రోడ్లు అంతటా పొగమంచు కశ్మీరాన్ని తలపిస్తోంది కదా..’అని జిల్లావాసులు వేకువ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ.. ఆకట్టుకునే ఈ పొగమంచు ప్రమాదాల్లోనూ ముంచుతుంది. ఈ సీజన్‌లో ఇలాంటి వాతావరణంలో తగుజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని అటు వైద్యులు, ఇటు అధికారులూ సూచిస్తున్నారు.
నిర్మల్
నిర్మల్
నిర్మల్


