న్యూ జోష్..
ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని తాకాయి. 2025కు వీడ్కోలు.. 2026కు స్వాగతం అంటూ.. జనం బుధవారం అర్ధరాత్రి నుంచే కేక్‌లు కట్ చేశారు. పాత ఏడాది ముగింపు వేళ వీడ్కోలు పార్టీలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన హోటళ్లు, ప్రధాన రహదారి వెంట స్టాళ్లు ఏర్పాటు చేసి రాత్రి వరకు నాన్‌వెజ్ స్నాక్స్, కేక్‌లు విక్రయించగా జనం ఎగబడి కొనుగోలు చేశారు. మద్యం ప్రియులతో వైన్స్‌షాపులు, బార్లు కిటకిటలాడాయి. చాలాచోట్ల డీజే పాటలు పెట్టుకుని పిల్లలు, యువత డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు పటాకులు కాల్చుతూ ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ.. కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేశారు. అనంతరం కేక్‌లు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మరోవైపు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. – నిర్మల్‌టౌన్
న్యూ జోష్..
న్యూ జోష్..


