వుషూ పోటీల్లో ప్రతిభ
భైంసాటౌన్: ఛత్తీస్‌గఢ్‌లో వుషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గత నెల 24నుంచి 30వరకు నిర్వహించిన తొమ్మిదో జాతీయస్థాయి వుషూ పోటీల్లో జిల్లాలోని ఖేలో ఇండియా వుషూ కేంద్రం క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియ ర్ వుషూ ఫెడరేషన్ కప్ పోటీల్లో 12మంది పా ల్గొన్నారు. వీరిలో నర్వాడే రుద్ర, అబ్దుల్ రెహమాన్, గోరా అనన్య కాంస్య పతకాలు సాధించారు. వీరు వుషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో సోహైల్ అహ్మద్ చేతుల మీదుగా అందుకున్నట్లు వుషూ ఖేలో ఇండియా శిక్షణ కేంద్రం భైంసా ముఖ్య శిక్షకుడు శ్రీరాముల సాయికృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.


