నాణ్యమైన వైద్యం అందించాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద ప్రజలకు కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖపై సమీక్షించారు. ఏడాదిగా జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి, ప్రసూతి ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఉప కేంద్రాలు, అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు అందించిన వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్ సేవలు, ఇతర సదుపాయాలు, ఆస్పత్రుల్లో కల్పించిన మౌలిక వసతులపై సమీక్షించారు. అనంతరం జిల్లా వైద్యకళాశాలపై క లెక్టర్ సమీక్ష నిర్వహించారు. వైద్యకళాశాలలో మొ దటి సంవత్సరం విద్యార్థులు 99 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ మెరుగైన బోధన అందిస్తూ ఇలాంటి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన పనులు పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం గ్రామీణ ప్రజల కోసం వారి నివాస ప్రాంతాల్లోనే క్షయ వ్యాధిని గుర్తించే పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. యంత్రం పనితీరును అధికారులు కలెక్టర్‌కు వివరించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజేందర్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధికారులు గోపాల్‌సింగ్, సరోజ, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం’
మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యమని కలెక్టర్ అభిలాష అభినవ్ పే ర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్ల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా జనవరి 1న సంబంధిత నోటీసు బోర్డులపై ప్రచురించనున్నట్లు తెలిపారు. జాబితాలో పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో తప్పులు, అభ్యంతరాలుంటే నిబంధనల ప్రకారం సకాలంలో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులకు తెలుపాలని సూచించారు. వారి ద్వారా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తుది ఓటర్ల జాబితాను ఈ నెల 10న ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు, సమగ్ర ఓటర్ల జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించా లని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యా ణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, వివిధ పార్టీల ప్రతినిధులు కోరిపల్లి శ్రావణ్‌రెడ్డి, అజంబిన్ యహీయా, రాము, సయ్యద్ హైదర్, నాందేడపు చిన్ను, భరత్విజయ్, మజార్, వినోద్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.


