సంక్రాంతికి ‘భరోసా’!
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా రైతులకు రేవంత్‌రెడ్డి సర్కారు సంక్రాంతి కానుక ప్రకటించబోతోంది. యాసంగి సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేయాలని ని ర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల ఫ లితాలతో ఉత్సాహంగా ఉన్న ప్రభుత్వం.. రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతులకు ఈ సాయాన్ని సకాలంలో అందించి సానుకూలతను మరింత పెంచుకోవాలని భావిస్తోంది.
ఎన్నికల హామీ ఏమైంది?
రైతులకు పెట్టబడి సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధుకు శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా రైతులకు అండగా నిలిచింది. ఎకరా కు రూ.6వేల చొప్పున రెండు పంటలకు రూ.12వే ల పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చింది. గత అ సెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఒ క్కో సీజన్‌కు ఎకరాకు రూ.7,500 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక రైతుబంధు పేరును రైతు భరోసాగా మార్చి ఎకరాకు రూ.6వేలే ఇస్తోంది. పెరిగిన విత్తనాలు, ఎరువులు, పెట్టుబడితో రూ.6వేలు ఎటూ సరిపోవడం లేదు.
ఈ ఖరీఫ్‌లో తొలుత ఎకరంలోపు ఆ తర్వాత ఎకరం, రెండెకరాలు, మూడు, నాలుగు, ఐదు ఆపైనా పరిమితి లేకుండా అందరికీ రైతు భరోసా అందించింది. పెట్టుబడి సాయం అందడంతో రైతులు ఖరీఫ్‌లో అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అధిక వ ర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయా రు. ఈసారి రబీ ఆదుకుంటుందని గంపెడాశతో ఉన్నారు. ఖరీఫ్‌లో పంటలు దెబ్బతిన్న కారణంగా చేతిలో చిల్లి గవ్వలేక పెట్టుబడి కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం రెండో విడత రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తే అప్పుల బాధ ఉండదని అభిప్రాయపడుతున్నారు.
జిల్లా రైతులకు రూ.268.85కోట్లు!
జిల్లాలో 1,88,597 మంది రైతులు పెట్టుబడి సాయానికి అర్హుత కలిగి ఉన్నారు. వీరందరికీ పెట్టుబడి సాయం కింద సుమారు రూ.268. 85 కోట్లు అవసరం ఉంది. ప్రభుత్వం ఈసారి పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. సాగులో ఉన్న భూములను కచ్చితంగా గుర్తించేందుకు వ్యవసాయశాఖ శాటిలైట్ సర్వేను ప్రాతిపదికగా తీసుకుంటోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ సర్వే విజయవంతమైంది. క్షేత్రస్థాయిలో ఏఈవోలు సాగు వివరాలు సేకరిస్తున్నారు. గతేడాది యాసంగి మాదిరిగానే ఈసారి కూడా అదే విస్తీర్ణంలో పంటలు సాగైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, సాగు లెక్కలతో సంబంధం లేకుండా సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ సంక్రాంతిలోపే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
గత ఖరీఫ్ రైతు భరోసా వివరాలు
మండలం రైతుల సంఖ్య పొందిన సొమ్ము
భైంసా 15,721 రూ.26,52,87,944
కుభీర్ 18,306 రూ.30,52,16,087
కుంటాల 8,186 రూ.13,18,81,741
దస్తూరాబాద్ 5,385 రూ.5,79,71,675
కడెం 11,750 రూ.14,24,94,612
ఖానాపూర్ 9,721 రూ.10,04,45,998
పెంబి 6,032 రూ.9,47,66,837
బాసర 6,793 రూ.11,35,78,013
లోకేశ్వరం 12,772 రూ.17,11,59,230
ముధోల్ 12,499 రూ.20,70,79,416
తానూర్ 15,588 రూ.26,40,92,246
దిలావర్‌పూర్ 6,962 రూ.9,28,60,943
నర్సాపూర్ (జీ) 7,487 రూ.10,23,01,284
సోన్ 7,577 రూ.8,55,12,709
లక్ష్మణచాంద 9,066 రూ.9,95,38,344
మామడ 10,947 రూ.14,80,91,078
నిర్మల్ రూరల్ 9,119 రూ.9,85,59,549
నిర్మల్ అర్బన్ 561 రూ.42,57,472


