ఆందోళన విరమణ
భైంసాటౌన్: పన్నెండు రోజులుగా ఆందోళన చేపట్టిన భైంసా మున్సిపల్ కార్మికులు బుధవారం విరమించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అభిలాష అభినవ్‌ను కలిసి సమస్యలు విన్నవించారు. పరిష్కారానికి ఆమె హామీ ఇచ్చారు. జనవరి 1నుంచి మార్చి వరకు నెల కు రూ.2వేలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశా రు. ఏప్రిల్ 1నుంచి జీవో ప్రకారం వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని భైంసా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బుధవారం మున్సిపల్ అధికారులు కార్మికులకు ఉత్తర్వుల ప్రతి అందించారు. ఈ మేరకు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆందోళన విరమించారు.


