అన్నిరంగాల్లో అభివృద్ధే లక్ష్యం
గతేడాది పోలీసక్క, నారీశక్తి, టీమ్ శివంగి, గాంజాగస్తీలు చేపట్టాం. ఈ ఏడాదిలో ప్రధానంగా యువత పక్కదోవ పట్టకుండా ప్రత్యేక దృష్టి పెడతాం. గతేడాదిలో గంజాయి, మత్తుమందులపై సీరియస్‌గా వ్యవహరించాం. పెద్దమొత్తంలో గంజాయి పట్టుకోవడంతో పాటు మత్తుమందు ముఠాలనూ అరెస్ట్ చేశాం. డ్రగ్స్ తీసుకుని యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రాణాలూ తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. గాంజాగస్తీ ద్వారా యువత భవిష్యత్‌ను కాపాడాలన్న లక్ష్యంతో పోలీసుశాఖ పనిచేస్తోంది.
డ్రంకెన్
డ్రైవ్‌పై సీరియస్
డ్రంకెన్ డ్రైవ్ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొత్త సంవత్సరంలో దీనిపై సీరియస్‌గా దృష్టిపెడతాం. నిండు జీవితాలను నిలబెట్టేందుకు నిర్మల్ పోలీస్–మీపోలీస్ పేరిట మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. శాంతిభద్రతలతో పాటు సైబర్, సామాజిక నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహిస్తాం.
ప్రజాభద్రతపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందేలా కృషిచేస్తాం. గతేడాది బాలశక్తి, అ మ్మరక్షిత లాంటి వినూత్న కార్యక్రమాలను వి జయవంత చేశాం. జిల్లాకు జాతీయస్థాయిలో పేరురావడం సంతోషాన్నిచ్చింది. వివిధ రంగాల్లోనూ సాధించిన ప్రగతితో జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నాం. 2026 సంవత్స రంలోనూ కొత్త కార్యక్రమాలతో జిల్లా అభివృద్ధికి అన్ని రకాల పాటుపడతాం.
ఈ ఏడాది వీటిపై ప్రత్యేకదృష్టి
జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు పంపించాం. ఈ ఏడాది వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు మంచి అనుభూతి ఇవ్వాలనుకుంటున్నాం. యువ త, విద్యార్థులకు కావాల్సి న క్రీడాభివృద్ధిలో భాగంగా కొత్త కార్యక్రమాలు, సైక్లింగ్ ర్యాలీ, టెన్నిస్‌కో ర్టులు ఏర్పాటు చేస్తాం. జిల్లాలో గతేడాది విజయవంతంగా నిర్వర్తించిన ‘నిర్మల్ ఉత్సవాలు’ జనవరిలోనే నిర్వహిస్తాం. జి ల్లాకేంద్రాన్ని సుందరీకరణ చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ జిల్లావాసుల సహకారం ఉండాలని కోరుతున్నాం.
జిల్లావాసులకు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. కొత్తసంవత్సరం నేపథ్యంలో వారు ‘సాక్షి’తో ముచ్చటించారు. 2026లో చేపట్టనున్న పనులు, అనుకుంటున్న లక్ష్యాలు వారి మాటల్లోనే..
అభిలాష అభినవ్, కలెక్టర్
అన్నిరంగాల్లో అభివృద్ధే లక్ష్యం


