కూరగాయల సాగులో..
జిల్లాలోని నిర్మల్ రూరల్, దిలావర్‌పూర్ మండలాలకు చెందిన కొందరు రైతులు సంప్రదాయ పంటలకు భిన్నంగా కూరగాయల సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి, టమాటా వంటి కూరగాయలు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో పండించిన కూరగాయలను నేరుగా మార్కెట్‌లో విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. పాలకూర, మెంతి, క్యాబేజీ వంటి ఆకుకూరలతోపాటు కొందరు ఎకర భూమిలో కంది అంతర పంటగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఒక్కో రైతు నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు సంపాదిస్తున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్
కూరగాయల సాగులో..
కూరగాయల సాగులో..
కూరగాయల సాగులో..


