‘పర్యాటకం’ పరిహాసమేనా..!
● నీటిమూటలుగానే పాలకుల హామీలు
పర్యాటకుల లేక బోసిపోతన్న కడెం ప్రాజెక్టు
నిర్మల్: ‘నాన్నా.. టూడేస్ హాలీడేస్ ఉట్టిగనే గడిచిపోయాయి. ఈసారి ఎటూ తీసుకెళ్లలేదు. కనీసం బయటకూ వెళ్లలేదు నాన్నా..’అని బిడ్డ హాసిని అడుగుతుంటే.. నెలాఖరులో డబ్బులు లేక, మరోవైపు జిల్లాలో ఎలాంటి పర్యాటక ప్రదేశాలు లేక ఆ తండ్రి శ్రీనివాస్ సైలెంట్‌గా ఉండిపోయా డు. ఇలాంటి ఇబ్బందులు జిల్లాలో చాలా మంది తల్లిదండ్రులకు ఎదుర్కొంటున్నారు. ఇందుకు కార ణం జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడమే. జిల్లాలో పర్యాటక అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వాలు దశాబ్దాలుగా చెబుతున్నప్పటికీ ఎలాంటి ముందడుగా పడడం లేదు.
పక్కజిల్లాలకు వెళ్తున్నారు..
ఈ సీజన్‌లో క్రిస్‌మస్, న్యూఇయర్, సంక్రాంతికి వ చ్చే సెలవుల్లో చాలామంది పిల్లలు పెద్దలు కలిసి ప్రశాంతమైన ప్రకృతిలో గడపాలని భావిస్తారు. కానీ.. కనీసం ఒకరోజు కుటుంబమంతా కలిసి ఆహ్లాదంగా గడపడానికి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రదేశం లేదు. ఉన్న ఒకట్రెండు పర్యాటక ప్రదేశాల్లోనూ కనీసం అభివృద్ధి కనిపించడం లేదు. చేసేది లేక.. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి పక్కజిల్లాలకు, హైదరాబాద్, గోవాలకు వెళ్తున్నారు. రెండురోజుల పాటు ఆహ్లాదంగా గడపడానికి రూ.వేలు ఖర్చుచేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
మంత్రిగారూ.. దృష్టిపెట్టాలి..
జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రిగానూ ఉన్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని జిల్లావాసులు కోరుతున్నా రు. స్థానిక పాలకులు, అధికారులు ఇప్పటికి చాలా సార్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపుతున్నారే తప్ప.. వాటిని అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావ డం లేదన్న వాదనా ఉంది. జిల్లా పాలకులు, అధికారులు, ఇన్‌చార్జి మంత్రి కూడా పర్యాటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని విన్నవిస్తున్నారు.


