ఘనంగా సీపీఐ నూరేళ్ల వేడుక
ఖానాపూర్: సోషలిజం స్థాపన కోసం బలమైన విప్లవ ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ శతాబ్ది వేడుకలు ఖానాపూర్ పట్టణంతోపాటు మండలంలోని బావపూర్, తర్లపాడు, జిలేడుకుంట, అ డవి సారంగాపూర్, పాత ఎల్లాపూర్, బీర్నంది, రంగపేట, చామనపల్లి, పాత తర్లపాడు, సతనపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఎర్ర జెండాలు ఆవిష్కరించారు. దేశంలో శ్రామిక పీడితవర్గాల విముక్తి కో సం సోషలిజం స్థాపన లక్ష్యంతో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ గడిచిన 100 ఏళ్ల కాలంలో ప్రజల పక్షాన అనేక చరిత్రాత్మకమైన పోరాటాలు చేసిందని తెలి పారు. కార్యక్రమంలో జక్కుల రాజన్న, కూర్మ రాజన్న, పుసం లక్ష్మణ్, ఆత్రం భీంరావు, సోనేరావు, బీర్‌సావ్ గోరేబాయ్, మోహన్, మనోహర్, గంగారాం, శంకర్ పాల్గొన్నారు,
చింతల్‌చాందలో..
లక్ష్మణచాంద్: మండలంలోని చింతల్‌చాంద గ్రామంలో సీపీఐ శతాబ్ది వేడుకలు నిర్వహించారు. జిల్లా నాయకుడు గంగన్న జెండా ఆవిష్కరణ చేశారు. శ్రామిక పీడిత వర్గాల విముక్తి కోసం, సోషలిజం స్థాపన లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందన్నారు. 1925 డిసెంబర్ 26 నుండి 28 వరకు ఉత్తరప్రదేశ్‌లోని కాన్‌పూర్‌లో జరిగిన మహాసభలలో దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొని భారత కమ్యూనిస్టు పార్టీని లాంఛనంగా స్థాపించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.లక్ష్మి, రాజవ్వ, లక్ష్మణ్, చిన్న గంగన్న తదితరులు పాల్గొన్నారు.


