
నిలిచిన రైళ్ల రాకపోకలు
బాసరలో గోదావరి నదికి వరదనీరు పోటెత్తింది. గోదావరినదిపై ఉన్న రైల్వే బ్రిడ్జికి రెండు ఫీట్ల కింది నుంచే నీళ్లు ప్రవహిస్తుండడంతో ఆ శాఖ అధికారులు అప్రమత్తమయ్యా రు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు బాసర స్టేషన్ మేనేజర్ రవీందర్ తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.
బాసర ఎస్బీఐలోకి చేరిన నీరు
గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ బాసర మండల కేంద్రంలోని ఎస్బీఐలోకి చేరింది. మేనేజర్ అశోక్‌కుమార్, అధికారులు అప్రమత్తమై వరద నీ టిని బయటికి తీసేందుకు ప్రయత్నం చేశా రు. రెండు, మూడు రోజులు సేవలకు అంతరాయం కలగవచ్చని వారు తెలిపారు. సహకరించాలని ఖాతాదారులను కోరారు.