
డిస్కస్ త్రోలో జ్యోతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలానికి చెందిన బిస్సే సుధామ–అనసూయ దంపతుల కుమార్తె జ్యోతి ప్రస్తు తం జిల్లా కేంద్రంలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. జ్యోతి డిస్కస్‌త్రోలో సత్తా చాటుతోంది. రాష్ట్రస్థాయి వేదికల్లో ఇప్పటివరకు రెండు రజత పతకాలు, ఓ కాంస్య పతకంతో సత్తా చాటింది. ఓవైపు ఓ అథ్లెట్‌గా రాణిస్తూనే అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ వేదికగా మే 16నుంచి 30వరకు నిర్వహించిన డిస్టిక్ర్ట్ టెక్నికల్ అఫీషియల్ కోర్సులో ఉత్తీర్ణత సాధించింది. కొద్దిరోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా స్థాయి టెక్నికల్ అఫీషియల్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ ఇప్పుడు మహబూబ్‌నగర్ వేదికగా ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న 11వ జూనియర్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎంపికై ంది. కాల్ రూమ్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించనుంది.