
ఆల్ రౌండర్‌గా వసంత
నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన చిక్కుడు చిన్నక్క–చిన్నయ్య దంపతుల కుమార్తె వసంత రాష్ట్రస్థాయి వేదికల్లో అథ్లెటిక్స్‌లో సత్తా చాటుతూ రాష్ట్రస్థాయి రిఫరీగా ఎంపికై ంది. ట్రిపుల్ జంప్‌లో ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకంతో మెరిసింది. ఒక స్వర్ణం, మరో కాంస్యంతో సత్తా చాటింది. షాట్ పుట్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. హైజంప్‌లో రెండు కాంస్యాలతో ప్రతిభ కనబరిచింది. దాదాపు అన్ని ఈవెంట్‌లలో ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన డిస్టిక్ర్ట్ టెక్నికల్ అఫీషియల్ కోర్సులో ఉత్తీర్ణత సాధించింది. మహబూబ్‌నగర్ వేదికగా ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న 11వ జూనియర్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎంపికై ంది.