
కజ్జర్ల శివారులో చిరుత సంచారం
తలమడుగు: మండలంలోని కజ్జర్ల, దేవాపూ ర్ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. పంట పొలాలకు వెళ్లే రైతులకు చిరుత పాదముద్రలు కనిపించడంతో వారు పెద్దపులివిగా భావించి భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ బీట్ ఆఫీసర్ కృష్ణను సంప్రదించగా అవి చిరుతపులి అడుగులుగా గుర్తించారు. కజ్జర్ల, దేవాపూర్ శివారులో అట వీ ప్రాంతం నుంచి చిరుతపులులు వచ్చి వెళ్తున్నట్లు తెలిపారు. రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవి ఒకే చోట ఉండవని పేర్కొన్నారు. చిరుతపులి ఎవరికై నా కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.