
గోదారమ్మ మహోగ్రరూపం
బాసర గుడి సమీపానికి జలం మునిగిన లాడ్జీలు, దుకాణాలు పంట పొలాల్లో నిలిచిన నీరు ఆందోళన చెందుతున్న రైతులు 1983 తర్వాత మరోసారి వరద
బాసర: మూడు రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షానికి మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి ఎస్సారెస్పీలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో గోదావరినది ఉప్పొంగి ప్రవహిస్తోంది. బాసరలోని హరిహర కాటేజ్‌లో జలదిగ్బంధంలో చిక్కుకున్న రెండు కుటుంబాలకు చెందిన 11 మందిని రెవెన్యూ, పోలీస్, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు బయటకు తీసుకువచ్చారు. బ్రిడ్జికి 10 ఫీట్ల కింది నుంచి ప్రవహిస్తూ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి బ్యాక్ వాటర్‌తో పంట పొలా లు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి. గోదా వరి ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. బాసర రైల్వేస్టేషన్, శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయ సమీపం వరకు నదీ జలాలు వచ్చాయి. సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. నదీ ప్రవాహంతో పలు రోడ్లు జలమయం కావడంతో బాసర నుంచి పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయా యి. గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా సోయా, పత్తి, వరి పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆయా కాలనీల్లో వైద్యసేవలు
భారీ వర్షాల నేపథ్యంలో బాసరలోని పలు కాలనీ లు అపరిశుభ్రంగా మారాయి. వరదనీటితో ఆయా కాలనీలవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో సూపర్‌వైజర్ ఆ శాలత, ఏఎన్‌ఎం, సిబ్బందితో ఇంటింటా తిరిగా రు. విష జ్వరాలు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి సేవలందిస్తున్నారు. అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నారు.
ముమ్మరంగా సహాయక చర్యలు
వరద ముంపునకు గురైన బాసర మండంలోని ఓనీ, కౌటా, సావర్గం, సాలాపూర్, బిద్రెల్లి, లాబ్ది, టాక్లి గ్రామాలను ఎస్పీ జానకీ షర్మిల శుక్రవారం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. వరద ప్రవా హం ఉన్నచోట చెరువులు, కుంటలు, వాగులు వద్దకు వెళ్లొద్దని అప్రమత్తం చేశారు. స్థానిక తహసీల్దార్ పవన్‌చంద్ర, ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌గౌడ్ ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తూ ప్రజలకు తగిన సూచనలు చేస్తున్నారు.
బాధితులను తీసుకువస్తున్న పోలీసులు
తెప్పెలపై బాధితులతో వస్తున్న గజ ఈతగాళ్లు

గోదారమ్మ మహోగ్రరూపం

గోదారమ్మ మహోగ్రరూపం

గోదారమ్మ మహోగ్రరూపం