
అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత
కోటపల్లి: బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను గురువారం తెల్ల వారుజామున పట్టుకున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బన్సీలాల్ వివరాలు వెల్లడించారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా బొలెరోలో ఎలాంటి ఆధారాలు లేకుండా మహారాష్ట్రకు తరలిస్తున్న 62 బస్తాల యూరియా పట్టుబడడంతో వ్యవసాయాధికారి సాయికృష్ణరెడ్డికి సమాచారం అందించామన్నారు. అతను వచ్చి యూరియాను పరిశీలించి అక్రమంగా తరలిస్తున్నారని చెప్పడంతో వాహనాన్ని కోటపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టామన్నారు. చెన్నూర్ పట్టణంలోని అస్నాద్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఫెర్టిలైజర్ షాపు నుంచి యూరియా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి వాహన డ్రైవర్‌పై రాజమల్లు, షాపు యజమాని బాపురెడ్డిపై ఫెర్టిలైజర్ కంట్రోల్ అర్డర్ 1983 చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.