
నిర్మల్
కడెం వరదలో వ్యక్తి గల్లంతు
కడెం మండలం కన్నాపూర్‌కు చెందిన తిప్పిరెడ్డి గంగాధర్(45) శనివారం చేపట లేటకు వెళ్లాడు. కడెం గేట్లు ఎత్తడంతో వరదలో గల్లంతయ్యాడు.
‘గడ్డెన్న వాగు’ ఐదు గేట్లు ఓపెన్
సారంగపూర్: మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు ఆరు వరద గేట్లు ఎత్తిన అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులుకాగా, పూర్తిగా నిండింది. శనివారం ఎగు వనుంచి 18,200 క్యూసెక్కుల వరద రావడంతో అధికారులు ఆరు గేట్లు ఎత్తి 29,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ మధుపాల్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు నీటి మట్టం 1,180 అడుగుల వద్ద స్థిరంగా ఉంచుతున్నామన్నారు.
‘స్వర్ణ’ ఆరు గేట్లు ఎత్తివేత
భైంసా: జిల్లాతోపాటు ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాల కురుస్తుండడంతో అధికారులు గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లను శనివారం ఎత్తివేశారు. ప్రాజెక్టు ఎనిమిది గేట్లలో ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు పేర్కొన్నారు. 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భైంసా పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఉరకలెత్తే నీటి దృశ్యాలను చూసి మురిసిపోయారు. ప్రాజెక్టు ప్రాంతమంతా రద్దీగా మారింది. మరోవైపు అధిరులు వాగు పరీవాహక ప్రాంత ప్రజలు, రైతులను అప్రమత్తం చేశారు.

నిర్మల్