ప్రయాణం.. ఇక సులభం | - | Sakshi
Sakshi News home page

ప్రయాణం.. ఇక సులభం

Aug 17 2025 6:09 AM | Updated on Aug 17 2025 6:09 AM

ప్రయా

ప్రయాణం.. ఇక సులభం

● ఈ పాస్‌ ప్రైవేట్‌, వాణిజ్యేతర కార్లు, జీపులు, వ్యాన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ● జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న టోల్‌ ప్లాజాలకు మాత్రమే ఈ పాస్‌ చెల్లుబాటవుతుంది. ● హైదరాబాద్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ ప్లాజాలకు ఈ పాస్‌ వర్తించదు. ● రాష్ట్ర రహదారులు, స్థానిక సంస్థలు లేదా పార్కింగ్‌లలో ఫాస్టాగ్‌ లేదా సాధారణ రుసుములు వర్తిస్తాయి. ● పాయింట్‌ ఆధారిత టోల్‌ ప్లాజాలలో ప్రతి క్రాసింగ్‌ ఒక ట్రిప్‌గా, క్లోజ్డ్‌ టోల్‌ ప్లాజాలలో ఒక ఎంట్రీ–ఎగ్జిట్‌ జత ఒక ట్రిప్‌గా పరిగణించబడుతుంది. ● పాస్‌ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం లేదా 200 టోల్‌ ప్లాజా క్రాసింగ్‌ల వరకు చెల్లుబాటవుతుంది. ● ఈ పాస్‌ బదిలీ చేయలేనిది. నమోదు చేసిన వాహనానికి మాత్రమే వర్తిస్తుంది.

అమలులోకి వార్షిక టోల్‌ పాస్‌ ఏడాదికి రూ.3 వేలు ఒకసారి చెల్లిస్తే 200 సార్లు ప్రయాణించే అవకాశం తప్పనున్న ఆర్థిక భారం

లక్ష్మణచాంద: జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే వాహనదారులకు టోల్‌ ప్లాజాల వద్ద చెల్లించే రుసుము ఆర్థిక భారంగా మారేది. దీంతో కొందరు టోల్‌ రుసుము తప్పించుకోవడానికి దూరమైన ఇతర మార్గాలను ఎంచుకునేవారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం ద్వారా ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగనున్నాయి. కేవలం రూ.3 వేలు చెల్లించి వార్షిక టోల్‌ పాస్‌ తీసుకుంటే జాతీయ రహదారులపై ఏడాదిలో 200 సార్లు టోల్‌ రహితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ నూతన విధానం ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది.

ఒకసారి తీసుకుంటే 200 ట్రిప్‌లు..

గతంలో ఒక టోల్‌ ప్లాజా వద్ద నెలవారీ పాస్‌ కోసం రూ.350 చెల్లిస్తే, ఆ నెలలో ఆ టోల్‌ ప్లాజా వద్ద మాత్రమే ప్రయాణించే వెసులుబాటు ఉండేది. కానీ, కొత్త విధానం ప్రకారం, రూ.3 వేలతో వార్షిక పాస్‌ తీసుకున్న వాహనదారుడు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న టోల్‌ ప్లాజాల గుండా ఏడాదిలో 200 సార్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పాస్‌ ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్స్‌ పూర్తయ్యే వరకు చెల్లుబాటవుతుంది.

జిల్లాలో టోల్‌ ప్లాజాలు..

నిర్మల్‌ జిల్లాలో జాతీయ రహదారి 44పై సోన్‌ మండలంలోని గంజాల్‌ వద్ద ఒక టోల్‌ ప్లాజా, జాతీయ రహదారి 61పై దిలావర్‌పూర్‌ మండల కేంద్రంలో మరొక టోల్‌ ప్లాజా ఉన్నాయి. ఈ రెండు టోల్‌ ప్లాజాలు జిల్లా వాహనదారులకు కీలకమైనవి. వార్షిక టోల్‌ పాస్‌ విధానం వాహనదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక, జాతీయ రహదారులపై సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ విధానం వాహనదారులకు సమయం, డబ్బు రెండూ ఆదా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.

వార్షిక పాస్‌ నిబంధనలు..

భారం తగ్గుతుంది

వివిధ పనుల నిమిత్తం గుండంపెల్లి నుంచి హైదరాబాద్‌కు నెలలో పలు మార్లు వెళ్లాల్సి వస్తుంది. గతంలో ఉన్న విధానంతో టోల్‌ ప్లాజాల వద్ద రుసుములు ఎక్కువగా ఉండటంతో ఆర్థికంగా ఎక్కువ భారం పడేది. కేంద్ర ప్ర భుత్వం తెచ్చిన వార్షిక పాస్‌తో కేవలం రూ.3 వేలు చెల్లించి అన్ని జాతీయ రహదా రులపై ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. దీంతో వాహనదారులపై ఆర్థిక భారం తగ్గుతుంది.

– తక్కల రమణారెడ్డి, గుండంపెల్లి

వాహనదారులు వినియోగించుకోవాలి

వార్షిక టోల్‌ పాస్‌ను వాణిజేత్యర వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఫాస్టాగ్‌ ఉన్నా గతంలో ఒక కారుకు ఒక టోల్‌ ప్లాజా వద్ద రూ.75 చెల్లించాల్సి వచ్చేంది. నేడు వార్షి పాస్‌తో ఒక టోల్‌ ప్లాజాల వద్ద కేవలం రూ.15 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాహనదారులకు ఆర్థికంగా భారం తప్పుతుంది.

– సంతోష్‌రెడ్డి, గంజాల్‌ టోల్‌ప్లాజా మేనేజర్‌

సోన్‌ మండలం గంజాల్‌ టోల్‌ ప్లాజా

ప్రయాణం.. ఇక సులభం1
1/3

ప్రయాణం.. ఇక సులభం

ప్రయాణం.. ఇక సులభం2
2/3

ప్రయాణం.. ఇక సులభం

ప్రయాణం.. ఇక సులభం3
3/3

ప్రయాణం.. ఇక సులభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement