
వేధింపులతో మహిళ మృతి
తలమడుగు: వేధింపులతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాధిక తెలిపిన వివరాల మేరకు తలమడుగు మండలంలోని కజర్ల గ్రామానికి చెందిన మొట్టె మానస(25)కు అదే గ్రామానికి చెందిన గంపల ప్రశాంత్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ప్రశాంత్ ఆర్మీలో ఉద్యోగం చేస్తుండడంతో మానసను జమ్మూకశ్మీర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ భర్త, అత్తామామలు శారీరకంగా, మానసికంగా వేధించడంతో ఆరోగ్యం క్షిణించింది. దీంతో మహిళ కుటుంబ సభ్యులు కజ్జర్లకు తీసుకువచ్చి ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చేర్పించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి పూర్ణచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు..
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడ సమీపంలో రహదారిపై ఈ నెల11న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయికుంటకు చెందిన రామటెంకి రాజవ్వ (84) మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. వృద్ధురాలు సోమవారం చున్నంబట్టి వాడ సమీపంలో రోడ్డు దాటుతుండగా మంచిర్యాల వైపు నుంచి శ్రీరాంపూర్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. రాజవ్వకు తలకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి కూతురు మల్లక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
బ్యాంక్ సిబ్బందిపై దాడి!
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్ షాపు యజమాని బ్యాంక్ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. మంగళవారం బ్యాంక్ రుణానికి సంబంధించి రికవరీ కోసం వెళ్లగా బ్యాంక్ ఉద్యోగులు, షాపు యజమానికి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో షాపు యజమాని కత్తెరతో దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుడిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్‌ను వివరణ కోరగా.. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.
అదుపుతప్పి వ్యాన్ బోల్తా
బెల్లంపల్లి: బెల్లంపల్లి శివారులోని నేషనల్‌హైవే బైపాస్ రోడ్డుపై మంగళవారం తెల్లవారు జా మున సరుకుల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో రోడ్డుపక్కన బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డా డు. ఆ సమయంలో వెనుక నుంచి వాహనాలే వీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

వేధింపులతో మహిళ మృతి