
తొడసం కై లాస్‌కు సన్మానం
ఉట్నూర్‌రూరల్: రాష్ట్రపతి ఆహ్వానం అందుకున్న తొడసం కై లాస్‌ను ఆదివాసీ బిరుదుగోండి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాంజీగోండ్ భవన్‌లో మంగళవారం సన్మానించారు. గోండిభాషలో మహాభారత్ గ్రంథాన్ని రచించి ఏఐ ద్వారా అనేక పాటలు సృష్టించిన తొడసం కై లాస్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి విందుకు ఆహ్వానించినట్లు వారు పేర్కొన్నారు. ఆర్చరీ (విలువిద్య)లో అనేక మందికి శిక్షణనిచ్చి, ఇటీవల పురస్కారం అందుకున్న చించుఘాట్ గ్రామానికి చెందిన కాత్లే మారుతిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మర్సుకోలా తిరుపతి, ప్రధాన కార్యదర్శి తొడసం శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు పెందూర్ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.