
సింగరేణిని పరిరక్షించుకోవాలి
● ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్‌ప్రసాద్
శ్రీరాంపూర్: సింగరేణిని పరిరక్షించుకోవాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ ప్రసాద్ అ న్నారు. మంగళవారం నస్పూర్ కాలనీలోని శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, సంస్థ పరిరక్షణకు సేవ్ వర్కర్స్...సేవ్ సింగరేణి కార్యక్రమంలో భాగంగా ఈనెల 14న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా, 22న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీ స్‌ను ముట్టడించనున్నట్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యం తీసుకుంటున్న పలు నిర్ణయాలు కా ర్మికులకు ఇబ్బందిగా మారాయన్నారు. పర్మినెంట్ ఉద్యోగులను తగ్గించడం, కారుణ్య ఉద్యోగాల కల్పనలో ఇబ్బందులకు గురి చేయడం, 3,600 మందిని విజిలెన్సు కేసుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. కంపెనీలో కార్మికుల సంఖ్యను కుదించినట్లు అధి కారులను ఎందుకు తగ్గించడం లేదన్నారు.సమావేశంలో ఆ యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపల్లి సమ్మయ్య, జెట్టి శంకర్రావు, ఉపాధ్యక్షులు గరి గే స్వామి, కలవేన శ్యాం, ప్రధాన కార్యదర్శి ఏ నుగు రవీందర్‌రెడ్డి, నాయకులు జీవన్‌జోయల్, తి రుపతి రాజు, అశోక్, మెండె వెంకటి పాల్గొన్నారు.