
కాలినడకన వెళ్లి..చికిత్స అందించి
నార్నూర్: ఏజెన్సీలో కొలాం గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పీఎం జన్‌మన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించింది. సదరు వైద్యసిబ్బంది మంగళవారం మండలంలోని కొత్తపల్లి (హెచ్) కొలాంగూడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భీంపూర్ బొజ్జుగూడ (కొలాంగూడ) గ్రామానికి కాలినడకన వెళ్లి ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి చికిత్స అందించారు. 15 రోజులకు ఒకసారి కొలాం గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలు అందిస్తామని స్టాఫ్‌నర్స్ జంగుబాయి తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆమె వెంట ఎల్‌టీ గంగాదేవి, పారామెడికల్ అసిస్టెంట్ సావిత్రిబాయి, ఆశ కార్యకర్త లక్ష్మీబాయి, తదితరులు ఉన్నారు.