మెక్కేది మిల్లర్లే! | - | Sakshi
Sakshi News home page

మెక్కేది మిల్లర్లే!

Aug 13 2025 5:02 PM | Updated on Aug 13 2025 5:02 PM

మెక్కేది మిల్లర్లే!

మెక్కేది మిల్లర్లే!

నిర్మల్‌
కుడి.. ఎడమైతే!
కుడిఎడమైతే పొరపాటు లేదోయ్‌...అన్నాడో సినీ కవి.. వ్యక్తిలోని భిన్నత్వాన్ని బట్టి ప్రత్యేకతను ఆపాదిస్తాం. ఆగస్టు 13 వరల్డ్‌ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌ టౌన్‌: రాబోయే 72 గంటల్లో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్ల కూడదని, రైతులు విద్యుత్‌ తీగలు, స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలని తెలిపా రు. జిల్లాలో విపత్తు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. పొంగుతున్న వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. వరద ప్రభా విత ప్రాంతాలైన కడెం, స్వర్ణ ప్రాజెక్టు చుట్టూ పక్కన ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాన్నారు. చెరువులు, కుంటలు సందర్శనకు వెళ్లకూడదని పేర్కొన్నారు. అత్య వసర పరిస్థితుల్లో డయల్‌ 100 లేదా స్థానిక పోలీసు హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ టీంలు అప్రమత్తంగా ఉంటాయని వెల్లడించారు.

నిర్మల్‌: జిల్లాలో రైస్‌ మిల్లుల మాయాజాలం కొనసాగుతూనే ఉంది. అధికారులు ఎన్నికేసులు పెడుతున్నా.. మిల్లర్లు పేదలకు అందాల్సిన బియ్యాన్ని మెక్కుతూ.. కోట్లు కొల్లగొడుతున్నారు. ధాన్యాన్ని మర ఆడించి బియ్యాన్ని ఇవ్వాల్సిన రైస్‌ మిల్లులు ఆ ధాన్యాన్నే మింగేస్తున్నాయి. అధికారులకు ఖాళీ మిల్లులు చూపిస్తున్నాయి. ‘కేసులే కదా పెట్టుకోండి’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)లో మిల్లర్ల తీరు ఏమాత్రం మారడం లేదు. గడువుదాటినా బియ్యం ఇవ్వని ఏ రైస్‌ మిల్లును పరిశీలించినా.. ఖాళీ సంచులే దర్శనమిస్తున్నాయి. తాజాగా జిల్లాలో మరోరెండు రైస్‌మిల్లుల్లో బియ్యం లేకపోవడంతో అధికారులు కేసులు నమోదు చేశారు.

మరో రెండుమిల్లులపై..

ముధోల్‌ మండలం ముద్గల్‌లోని ఏషియన్‌ రైస్‌మిల్‌లో 2024–25సంవత్సరం ఖరీఫ్‌, రబీలో సేకరించిన 4,411.917 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి బియ్యాన్ని ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. ఇదే గ్రామంలోని గణపతి రైస్‌మిల్‌లోనూ 2024–25 ఖరీఫ్‌, రబీలో 2699.531 మెట్రిక్‌ టన్నుల బియ్యం లేకపోవడంతో సివిల్‌ సప్లయ్‌ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈనెల 8న ముధోల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఏషియన్‌ రైసుమిల్‌ 12 శాతం వడ్డీతో రూ.18.03 కోట్లు, గణపతి రైస్‌మిల్‌ రూ.11.02 కోట్ల విలువైన బియ్యం దారిమళ్లించినట్లు తేల్చారు. ఈరెండు మిల్లుల్లోనే దాదాపు రూ.30 కోట్ల బియ్యం మాయం చేశారు. ఈమధ్యకాలంలో నిర్మల్‌లోని సరస్వతీ రైసుమిల్‌, కడెంలోని రాఘవేంద్ర, బాసరలోని వరలక్ష్మి, మాటేగాంలోని వెంకటేశ్వర రైసుమిల్లుల్లోనూ సీఎంఆర్‌లో అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో అధికారులు కేసులు నమోదు చేశారు.

చర్యలు తీసుకుంటున్నాం..

సీఎంఆర్‌ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. జిల్లాలో గడువు దాటినా బియ్యం ఇవ్వని రైస్‌ మిల్లులపై చర్యలు తీసుకుంటున్నాం. తాజాగా రెండు మిల్లులపైనా కేసులు నమోదయ్యాయి. తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. గడువులోపు బియ్యం అప్పగించాలి.

– కిశోర్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌

న్యూస్‌రీల్‌

కొల్లగొట్టేందుకే మిల్లులు..

హమాలీ చార్జీలు పెంచాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: హమాలీ, చాట, దడ్వాయి చార్జీలు పెంచాలని అగ్రికల్చరల్‌ మార్కెట్‌ కమిటీ అడిషనల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో ఏఐటీయూసీ నాయకులు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.విలాస్‌ మాట్లాడుతూ 50 కేజీల బస్తాకు రూ.20, చాట చార్జీ రూ.6 పెంచాలన్నారు. హమాలీల సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఎస్‌యన్‌.రెడ్డి, భూక్య రమేశ్‌, ఎస్‌కే.హాజీ, సందేశ్‌, విఠల్‌, రాజుబాయి, గంగబాయి, సావిత్రిబాయి పాల్గొన్నారు.

గింజ లేకుండా మాయం...

తీసుకున్న ధాన్యాన్ని తిరిగి ఇవ్వకుండా బియ్యం గింజ కూడా లేకుండా మిల్లులు అమ్ముకుంటున్నాయి. సర్కారుకు ఇవ్వాల్సిన మెట్రిక్‌టన్నుల కొద్దీ ధాన్యాన్ని ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులు దాటించేశాయి. జిల్లాలో ఓవైపు అధికారులు కేసులు నమోదు చేస్తున్నా.. మిల్లర్ల మాయాజాలం మాత్రం ఆగడం లేదు. క్రిమినల్‌ కేసులను నమోదుచేస్తున్నా.. ధాన్యం డబ్బుల రికవరీకి ఆర్‌ఆర్‌ యాక్ట్‌లను పెడుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.

జిల్లాలో ఆగని మిల్లర్ల మాయాజాలం

కేసులు పెడుతూనే ఉన్నా అదే దోపిడీ

తాజాగా మరో రెండింటిపై కేసులు

రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తుంది. వారు గడువులోపు మిల్లింగ్‌ చేసి బియ్యం రూపంలో తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధిత మిల్లర్లు కమీషన్‌ రూపంలో తీసుకుంటారు. ఈక్రమంలో మిల్లుల్లో ధాన్యాన్ని అమ్ముకుంటూ.. అధికారుల తనిఖీలప్పుడు ఏదో మేనేజ్‌ చేస్తున్నారు. లేదంటే.. మొత్తం అమ్ముకుని చేతులు ఎత్తేస్తున్నారు. ఏళ్లుగా చాలామంది మిల్లర్లు ఇలా చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. స్వల్పకాలంలోనే కోట్లు సంపాదించే రాజమార్గంలా మిల్లులు కనిపిస్తుండటంతో ఇటీవల కాలంలో జిల్లాలో చాలామంది రైసుమిల్లుల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. సర్కారు ఇచ్చిన గడువును పట్టించుకోకుండా.. ధాన్యాన్ని అమ్మేసుకుంటూ.. రేషన్‌ దుకాణాల నుంచి వచ్చిన బియ్యాన్ని తిరిగి సర్కారుకు అప్పగిస్తూ.. అక్రమదందా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement