
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సి న బాధ్యత మన అందరిపై ఉందని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఓటు చోరీకి వ్యతిరేకంగా రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను మంగళవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు వీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ‘ఓటు చోరీ’ ఆరోపణలకు సంబంధించి దేశవ్యాప్త ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా వెబ్ పేజీని పార్టీ ప్రారంభించిందని, అందులో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు చోరీపై కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, పీసీసీ సభ్యులు సాధ సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.