
‘కార్మిక సమస్యలపై పోరాడుతాం’
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని బీఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇన్‌చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన సీసీసీ కార్నర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగులతో చేయించాల్సిన బొగ్గు ఉత్పత్తిని కూడా కాంట్రాక్టర్లతో చేయిస్తున్నారన్నారు. బొగ్గు ఉత్పత్తి 50 శాతం పర్మినెంట్ ఉద్యోగులు, సంస్థ ఆధ్వర్యంలోనే జరగాలన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాలు ప్రకటించి కార్మికులకు వాటా చెల్లించాలన్నారు. యూనియన్ రాష్ట్ర నాయకులు మండ రామాకాంత్, పులి రాజిరెడ్డి, అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, శ్రీరాంపూర్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు సత్తయ్య, కార్యదర్శి రాజేందర్, నాయకులు కమలాకర్, కిరణ్‌కుమార్, మహేందర్, నాగేశ్వర్ రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.