అందరికీ సమాన సేవలు
నిర్మల్‌టౌన్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు పోలీసు సిబ్బంది మరింత బాధ్యతతో పని చేయాలని, ధనిక, పేద తేడా లేకుండా అందరికీ సమాన సేవలు అందించా లని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీ సులకు ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి సేవా పతాకాలు అందుకున్న 17 మంది పోలీసులను అభినందించారు. అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనస్ అలీ, ఇన్‌స్పెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, కృష్ణ, సమ్మయ్య, ఆర్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


