‘ఎస్‌ఐఆర్’ సమర్థవంతంగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగమైన ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఏఆర్వోలతో సోమవారం ఎస్‌ఐఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో రోజుకు దాదాపు 10వేల చొప్పున, వారం రోజుల లోపు మ్యాపింగ్ ప్రక్రియ నమోదు కావాలని ఆదేశించారు. నిర్ధిష్ట సమయంలోపు ఈ ప్రక్రియ ముగించాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియతో పాటు, ఓటరు జాబితాలో సరిగా లేని ఓటర్ల ఫొటోలు గుర్తించి, ఫారం నంబర్ 8 ద్వారా అసలైన ఫొటోలతో ఆధునీకరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. జిల్లాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగమైన ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. సరిపడినంత మంది సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


