ఒంటరితనం భరించలేక ఆత్మహత్య
రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్ అధికారుల ప్రతిభ
ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్ అధికారులు ప్రతిభ కనబర్చారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లోని రైల్వే నిలయం ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ ఎకై ్సజ్, గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆసిఫాబాద్ డీపీఈవో జ్యోతికిరణ్ బాడ్మింటన్‌లో ప్రథమ బహుమతి సాధించగా, చెస్, క్యారమ్ పోటీల్లో ఇచ్చోడ సీఐ జుల్ఫేఖార్ అహ్మద్ రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి సాధించారు. వీరిని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కె.రఘురాం అభినందించారు. వీరు బహుమతులు అందుకోవడంపై ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్ శుభాకాంక్షలు తెలిపారు.
కారును ఢీ కొట్టిన లారీ
సాత్నాల: భోరజ్ మండలం తర్ణం గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై గౌతమ్ పవార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన అగర్వాల్ రామావతావర్ నిరాల గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకుని ఆదిలాబాద్‌కు కారులో తిరిగి వెళ్తున్నారు. తర్ణం సమీపంలో ఎదురుగా, అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. దీంతో కారు ధ్వంసం కాగా అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు అగర్వాల్ రామావతావర్‌కు గాయాలయ్యాయి. అగర్వాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


