‘అంకురాలు 2’ ఆవిష్కరణ
లక్ష్మణచాంద: హైదరాబాద్‌లోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో బాల చెలిమి మాసపత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్ అధ్యక్షతన జరిగిన జాతీయస్థాయి కథల పోటీల బహుమతి ప్రదానోత్సవం, గ్రంథాలయం ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తె లంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సెక్రటరీ డాక్టర్ రావి శారద ముఖ్య అతిథులుగా పాల్గొని పుస్తకాల గొప్పతనాన్ని తెలియజేశారు. సోన్ మండలం న్యూవెల్మల్ బొప్పారం ప్రభు త్వ ఉన్నత పాఠశాల కు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు కొండూరు పోతన్న సంపాదకత్వంలో విద్యార్థులు రచించిన అంకురాలు 2 కథల సంపుటిని బాల చెలిమి సంపాదకులు డాక్టర్ మణికొండ వేదకుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. అంకురాలు 2 సంపాదకుడు కొండూరు పోతన్నను సన్మానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని బాల చెలిమి మాసపత్రిక సంపాదకులు 20 పాఠశాలలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయ డం జరిగింది. అందులో సోన్ మండలం వెల్మల్ బొప్పారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా ఎంపికై ంది.


