టెట్ నుంచి మినహాయించాలి
ఖానాపూర్: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.నరేంద్రబాబు, బీవీ.రమణారావు అన్నారు. పట్టణంలోని పీఆర్టీయూ భవన్‌లో ఆదివారం మండల అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్లు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈమేరకు చట్ట సవరణ చేయాలని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. విద్యా హ క్కు చట్టం ప్రకారం 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే దిశగా యూనియన్ కృషి చేస్తుందని అన్నారు. 51% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇవ్వాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. అనంతరం పీఆర్టీయూ మండల అధ్యక్షుడిగా దురిశెట్టి శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కోట వే ణు, పరమేశ్వర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, ప్రేమ్‌దాస్, కార్గం ప్రవీణ్, గంగామోహన్, దాసరి నర్స య్య, వాల్గోట్ కిషన్, బెజ్జారపు మురళి, రాజాశ్రీనివాస్‌రెడ్డి, జాడి శ్రీనివాస్, రమాదేవి, శ్రీలత, గంగన్న, గంగనర్సయ్య, సుజా త, ప్రణయశీల తదితరులు పాల్గొన్నారు.


