..అనే నేను
నేడు కొలువుదీరనున్న పంచాయతీ పాలకవర్గాలు ప్రమాణం చేయనున్న 399 మంది సర్పంచులు, వార్డు సభ్యులు ముస్తాబైన పంచాయతీ భవనాలు.. 23 నెలల తర్వాత పల్లెల్లో పాలకవర్గాలు
నిర్మల్
7
గజ్జలమ్మ దేవికి పూజలు
కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవార్లకు అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, పల్లకి సేవ నిర్వహించారు. మహా రాష్ట్రలోని ముంబై, నాందేడ్, ధర్మాబాద్, బోకర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు.
నిర్మల్‌చైన్‌గేట్: పల్లెల్లో పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఇటీవల మూడు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం పంచాయతీ కార్యాలయాల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ సంచాలకురాలు సృజన ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 400 గ్రామ పంచాయతీలు ఉండగా, 399 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 399 మంది సర్పంచులు, 399 మంది ఉప సర్పంచులతోపాటు వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారు.
రెండేళ్ల తర్వాత కొత్త పాలకులు..
తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసి 23 నెలలైంది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరబోతున్నాయి. ఇన్నాల్లు పాలకవర్గాలు, ప్రజాప్రతినిధులు లేక గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. అభివృద్ధి కుంటుపడింది. కేంద్ర నిధులు కూడా నిలిచిపోయాయి.
పంచాయతీ భవనాలకు రంగులు..
కొత్త పాలకవర్గాలు సోమవారం బాధ్యతలు చేపట్టనున్నాయి. సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలో పంచాయతీ భవనాలకు రిపేర్లు చేయించి రంగులు వేశారు. కొత్త ఫ్యాన్లు, ఫర్నిచర్ సమకూర్చారు. కొత్త సర్పంచులు సొంత నిధులతో వసతులు సమకూర్చుకున్నారు. ప్రభుత్వ ఫండ్స్ లేకపోయినా జనరల్ ఫండ్స్, సొంత ఖర్చులతో భవనాలు మెరుస్తున్నాయి. శానిటేషన్ పనులు వేగవంతమై, వీధులు శుభ్రం చేస్తున్నారు.
ప్రమాణం ఇలా..
అన్ని పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలతో మొదటి సమావేశం సోమవారం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో సర్పంచులు, వార్డు సభ్యులు ‘గ్రామ పంచాయతీ సర్పంచినైన/సభ్యుడినైన (విజేత పేరు) అను నేను.. శాసనం ద్వారా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండి, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర/సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను’ అని ప్రమాణం చేయాలి. ప్రమాణపత్రంపై సంతకం చేసిన అనంతరం వారు బాధ్యతలను స్వీకరిస్తారు.
..అనే నేను
..అనే నేను


