ట్రిపుల్ ఐటీని సందర్శించిన విద్యార్థులు
బాసర: విద్యా, విజ్ఞాన, అవగాహన యాత్రలో భా గంగా బాన్సువాడ, నస్రుల్లాబాద్ తెలంగాణ ట్రైబ ల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు 547 మంది, ఉపాధ్యాయులు 47 మంది బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ సందర్శనతో విజ్ఞా న సంబంధిత శాసీ్త్రయ దృక్పథం ఏర్పడుతుందన్నా రు. సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మక త పెంపొందుతాయని తెలిపారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ విద్యార్థులకు క్యాంపస్ సందర్శనతో వాస్తవ అనుభవం లభిస్తుందన్నారు. అకాడమిక్, సామాజిక, క్యాంపస్ సంస్కృతి, ల్యాబ్‌లు, లై బ్రరీలు, హాస్టల్స్ వంటి సౌకర్యాలు ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడంతో అవగాహన కలుగుతుందన్నారు. అసోసియేట్ డీన్లు ఎస్.విఠల్, కె.మహేశ్, ఎస్.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


