రూర్బన్ పరిశ్రమల పరిశీలన
కుంటాల: మండల కేంద్రంలో రూర్బన్ పథకంలో భాగంగా నిర్మించిన ఆడిటోరియం, న్యాప్‌కిన్ సెంటర్, మార్కెట్ షెడ్, దాల్‌మిల్‌ను ఏపీడీ నాగవర్ధన్ ఆదివారం పరిశీ లించారు. వీటి ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట ఏపీఎంలు లక్ష్మణ్, బోస్, ఏపీవో జయదేవ్, సీసీ ముత్యం తదితరులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
ఖానాపూర్: పట్టణంలోని కుమురంభీ చౌరస్తాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయలయ్యాయి. నిర్మల్ నుంచి కడెం మండలం కన్నాపుర్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తున్న లక్ష్మీనారాయణ కుక్క అడ్డుగా రావడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. స్థానికులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రూర్బన్ పరిశ్రమల పరిశీలన


