‘ఆస్పిరేషన్ బ్లాక్’ పకడ్బందీగా అమలు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: పెంబి మండలంలో నీతిఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నీతిఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమ ప్రత్యేకాధికారి శిల్పారావు అన్నారు. కలెక్టర్ ఛాంబర్‌లో సోమవారం ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమ అమలుతీరుపై ఆమె కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్య, వైద్యం, బ్యాంకింగ్, పోస్టల్ సేవలు, పోషకా హారం, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన, తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. అధికారులు సమన్వయంగా కృషి చేసి, భవిష్యత్తులో అన్ని రంగాల్లో పెంబి బ్లాక్‌ను అభివృద్ధి చేయాలన్నారు. సమీక్ష సమావేశానికి ముందు కలెక్టరేట్‌కు వచ్చిన ప్రత్యేకాధికారికి కలెక్టర్, అదనపు కలెక్టర్లు పూల మొక్క అందించి ఘన స్వాగతం పలికారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికా రి రాజేందర్, వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, డీఈవో భోజన్న, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి అంబాజీ, డీఆర్డీవో విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో శంకర్, పశువైద్యశాఖ అధికారి బాలిక్ అహ్మద్, ఎల్డీ ఎం రామ్ గోపాల్‌తో అధికారులు పాల్గొన్నారు.


