ఫలితాలపై పోస్టుమార్టం | - | Sakshi
Sakshi News home page

ఫలితాలపై పోస్టుమార్టం

Dec 23 2025 7:27 AM | Updated on Dec 23 2025 7:27 AM

ఫలితా

ఫలితాలపై పోస్టుమార్టం

మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 8లోu

న్యూస్‌రీల్‌

నిర్మల్‌, ముధోల్‌ ఓటమిపై ఆరా.. క్షేత్రస్థాయిలో సమన్వయ లోపాలపై దృష్టి స్థానిక ఎన్నికల వరకు పార్టీ బలోపేతం డీసీసీకి మార్గనిర్దేశం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరిలో జిల్లాకు ముఖ్యమంత్రి రాక

నిర్మల్‌
పాన్‌ ఇండియా ప్రస్థానం!
సింగరేణి ప్రస్థానం పాన్‌ ఇండియా స్థాయికి చేరింది. నవరత్న కంపెనీలకు దీటుగా నిలుస్తోంది. నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం.

విద్యార్థులు గణితంపై ఆసక్తి పెంచుకోవాలి

నిర్మల్‌ రూరల్‌: విద్యార్థులు గణితంపై ఆసక్తి పెంచుకోవాలని డీఈవో దర్శనం భోజన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని అర్బన్‌ కేజీబీవీని సోమవారం ఆయన పరిశీలించారు. గణిత దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. గణిత అభివద్ధితో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి గణితాభివృద్ధిని పరీక్షించారు.

నిర్మల్‌: జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అతితక్కువ సమయంలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే బొజ్జుపటేల్‌ పంచాయతీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తన సొంత నియోజకవర్గంలో అధికస్థానాలు సాధించిన నిర్మల్‌, ముధోల్‌లో కాంగ్రెస్‌ కొంత వెనుకంజలో ఉంది. డీసీసీగా పగ్గాలు చేపట్టడం, పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఆదివారం బొజ్జుపటేల్‌ హైదరాబాద్‌ వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. జిల్లాలో వచ్చిన ఫలితాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ సాధించిన స్థానాలపై సంతృప్తి వ్యక్తంచేస్తూనే, బీజేపీ ఆధిక్యతపై దృష్టిపెట్టాలంటూ నూతన డీసీసీ అధ్యక్షుడికి దిశానిర్దేశం చేశారు. గోదావరిపై మామడ మండలం పొన్కల్‌వద్ద సదర్‌మట్‌ బ్యారేజీ దాదాపు పూర్తికావడంతో ఫిబ్రవరిలో ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాకు రానున్నారు.

‘స్థానికం’ వరకు బలపడాలి..

జిల్లాలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ మంచి క్యాడర్‌, ప్రజల్లో ఆదరణ ఉందని సీఎం తెలిపినట్లు డీసీసీ పేర్కొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల వరకు పార్టీని క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేయాలని చెప్పారు. ఈ మేరకు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో నేతలు, వారి మధ్య సమన్వయ లోపాలు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టికృషి, ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ కంటే ఎక్కువ ఫలితాలను రాబట్టేలా ప్రణాళిక ప్రకారం వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

సమన్వయమే అసలు సమస్య..

కాంగ్రెస్‌ పార్టీకి పల్లెల నుంచి పట్టణాల దాకా పక్కాగా క్యాడర్‌ ఉంది. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న నేతలూ ఉన్నారు. కానీ.. చాలాచోట్ల బడాలీడర్ల మధ్య సమన్వయం లేకపోవడమే సమస్యగా మారుతోంది. పంచాయతీ ఎన్నికల్లోనూ చాలా మండలాల్లో ఇద్దరు సీనియర్‌ నేతలకు చెందిన మద్దతుదారులు బరిలో నిలిచారు. సొంతపార్టీ నుంచే రెబల్స్‌ ఉండటం ఇద్దరినీ ఓడించింది. ప్రధానంగా నిర్మల్‌, ముధోల్‌ నియోజకవర్గాల్లో సీనియర్‌ నేతల మధ్య సమన్వయం, సఖ్యత లేకపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నట్లు అధిష్టానం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ సమస్యలను డీసీసీ అధ్యక్షుడు బొజ్జుపటేల్‌ అధిగమించాలని సీఎం సూచించినట్లు తెలిసింది.

సీఎం సూచనలతో పార్టీ బలోపేతం..

జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన ఫలితాలపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల్లో అధికస్థానాలు గెలిచేలా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో నేతలందరినీ కలుపుకొని, సమన్వయంతో పార్టీని బలోపేతం చేస్తాం. రానున్న ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తాం.

– వెడ్మ బొజ్జుపటేల్‌, డీసీసీ అధ్యక్షుడు

‘పది’కి ప్రత్యేక ప్రణాళిక

ఫిబ్రవరిలో జిల్లాకు సీఎం..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు జిల్లాకు రాలేదు. ఫిబ్రవరిలో సీఎం జిల్లాకు రానున్నట్లు డీసీసీ అధ్యక్షుడు బొజ్జుపటేల్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం సీఎంను కలిసి ఇక్కడి సమస్యలను, అభివృద్ధి పనులను వివరించారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో తాను జిల్లాకు రానున్నట్లు తెలిపారని బొజ్జు తెలిపారు. మామడ మండలం పొన్కల్‌ వద్ద గోదావరిపై నిర్మించిన సదర్‌మట్‌ ఆనకట్ట ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనుల విషయంలో ముఖ్యమంత్రి రానున్నట్లు చెప్పారు.

నిర్మల్‌, ముధోల్‌పై ఆరా..

జిల్లాలో ఖానాపూర్‌ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌ అత్యధిక పంచాయతీలను గెలుచుకుంది. ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బొజ్జుపటేల్‌ సొంత నియోజకవర్గం కావడంతో అక్కడి పంచాయతీలు అధికార పార్టీవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈ ఫలితాలపై హర్షం వ్యక్తంచేసిన సీఎం రేవంత్‌ బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన నిర్మల్‌లో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఇక ముధోల్‌ నియోజకవర్గంలో పార్టీ చాలా పంచాయతీల్లో ఓడిపోవడంపై క్షేత్రస్థాయిలో ఆరా తీయాలని, ఓటమికి గల కారణాలను విశ్లేషించాలని డీసీసీకి సూచించారు.

ఫలితాలపై పోస్టుమార్టం 1
1/1

ఫలితాలపై పోస్టుమార్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement