రేపు బాసరలో లక్ష దీపోత్సవం
బాసర: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో ఈ నెల 24న బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారి సన్నిధిలో రాజయోగి వెంకటస్వామి, ఆత్మానందాశ్రమం(నృసింహపురం), రుస్తుంపేట, మెదక్ జిల్లా ఆధ్వర్యంలో 41వ లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
24న హుండీ ఆదాయం లెక్కింపు...
శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి హుండీ ఆదాయాన్ని ఈ నెల 24న అందరి సమక్షంలో లెక్కించనున్నట్లు ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు లెక్కింపు ప్రారంభించనున్నట్లు ఆలయ సిబ్బంది, బ్యాంకు అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సేవా భక్తులు పాల్గొంటారని తెలిపారు.
ఆలయానికి విరాళం
కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుజాత స్వరాజ్ అనే భక్తులు కుటుంబ సమేతంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉచిత అన్నదానం కోసం రూ.2లక్షల 1వెయ్యి, గోశాల గ్రాసం కోసం రూ.25వేలు ఆలయ ఈవో అంజనాదేవికి చెక్కు రూపంలో విరాళంగా అందజేశారు.అనంతరం ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.


