బాసర ఆలయ హుండీ లెక్కింపు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి 60 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం అక్షరాభ్యాస మండపంలో లెక్కించారు. రూ.77,77,746 నగదు, 126 గ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల 440 గ్రాముల మిశ్రమ వెండి, 17 విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు.
బాక్సింగ్ కమిటీ ఎన్నిక
శ్రీరాంపూర్: ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నూతన కమిటీని మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ్‌గౌడ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఆరుమల్ల రాజు, ప్రధాన కార్యదర్శి కే.దేవేందర్‌ను ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.


