ఘనంగా వాజ్‌పేయి జయంతి
నిర్మల్ రూరల్/భైంసాటౌన్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్, ముధోలో ఎమ్మెల్యే కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రామారావుపటేల్ పాల్గొని వాజ్‌పేయికి నివాళులర్పించారు. వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశ భద్రత, అభివృద్ధిలో వాజ్‌పేయి తనదైన ముద్ర వేశారన్నారు. భైంసాలో ప్రజాట్రస్ట్ చైర్మన్ మోహన్‌రావు పటేల్ ఆధ్వర్యంలో దారాబ్జి ఫ్యాక్టరీలో వాజ్‌పేయి జయంతి నిర్వహించారు. సంతోషిమాత ఆలయ సమీపంలో నందు భయ్యా ఆధ్వర్యంలో వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో నాయకులు మెడిసమ్మ రాజు,సాయి, అర్జున్, రాంశంకర్‌రెడ్డి, సాహెబ్‌రావ్, గంగా రెడ్డి, పద్మాకర్, విజయ్, నరేంద్రచారి, రంజి త్, భరత్, రాము, నారాయణ, విజయ్, చెన్న రాజేశ్వర్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వాజ్‌పేయి జయంతి


