బస్సు కోసం ఆందోళన
సారంగపూర్: మండలంలోని కంకెట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు వైకుంఠాపూర్–గొల్లమాడ రహదారిపై గు రువారం ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి కిలోమీటరు దూరం నుంచి వైకుంఠాపూర్ మీదుగా గొల్లమాడ గ్రామానికి ఆర్టీసీ బస్సు నిత్యం మూడుపూటలా వెళ్తుందన్నా రు. అదే బస్సును కంకెట వరకు నడపాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళ బస్సు రాకపోవడంతో కిలోమీటరు దూరం వరకు చీకట్లో కాలినడకన గ్రామానికి చేరుకుంటున్నామన్నారు. సమస్యను పలుమార్లు నాయకులు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆందోళనబాట పట్టామని తెలిపారు. ఆర్టీసీ అధికారులు స్పందించి తమ గ్రామాని కి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని ఆర్టీసీ డీఎం పండరికి సైతం ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. స్పందించిన డీఎం బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.


