ఉప్పొంగిన భక్తిభావం
లోక రక్షకుడి జననం..
నిస్సీ
ప్రార్థన
మందిరంలో
యేసయ్యను
ఆరాధిస్తున్న
యువతి
నిర్మల్‌టౌన్: కరుణామయుడు, లోక రక్షకుడు అయిన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచే చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అర్ధరాత్రి కొవ్వొత్తులు వెలిగించి, కేక్‌లు కట్ చేశారు. పాస్టర్లు, బిషప్‌లు క్రీస్తు బోధనలు వినిపించారు. అనంతరం ప్రభువును స్తుతిస్తూ సామూహికంగా భక్తిగీతాలు ఆలపించారు. మత పెద్దలు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేశారు. పలు చర్చీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నిర్మల్ సీఎస్‌ఐ చర్చిలో బిషప్ వ్యాస్ ధ్యానం అందించారు. వెంకటాపూర్‌లోని నిస్సీ చర్చిలో ఫాదర్ జయరాజ్ సందేశం ఇచ్చారు. గొల్లపేట్, సెయింట్ కాథలిక్, కర్మెల్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సీఎస్‌ఐ చర్చి వేడుకల్లో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేశారు. మత పెద్దలు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు.
సోన్ మండలం మాదాపూర్ చర్చిలో కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
క్రిస్మస్ సంబరాల్లో భాగంగా సీఎస్‌ఐ చర్చిలో కేక్ కట్ చేస్తున్న పాస్టర్స్
నిర్మల్ సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవులు
ఉప్పొంగిన భక్తిభావం
ఉప్పొంగిన భక్తిభావం
ఉప్పొంగిన భక్తిభావం
ఉప్పొంగిన భక్తిభావం


