భూ వివాదంపై విచారణ
ముధోల్: మండలంలోని ఎడ్‌బిడ్ గ్రామంలో శుక్రవారం భూవివాదంపై ఆర్డీవో కోమల్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ అవినాష్‌కుమార్ విచారణ చే పట్టారు. కొంతమంది తన భూమి ఆక్రమించి ఇండ్లు నిర్మించుకున్నారని బాధితుడు కొందపురం సాయన్న ఏప్రిల్ 27న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో భూవివా దంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల ని ఆర్డీవో, ఏఎస్పీని కమిషన్ ఆదేశించగా విచా రణ చేపట్టారు. వివాదంలో ఉన్న భూమికి కొ లతలు, హద్దులు నిర్వహించాలని సర్వేయర్ ప్రవీణ్‌ను ఆదేశించారు. దీంతో తహసీల్దార్ శ్రీ లత ఆధ్వర్యంలో సర్వేయర్, ఆర్‌ఐలు నారా యణరావుపటేల్, సరస్వతి, రెవెన్యూ సిబ్బంది భూమికి కొలతలు తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. సీఐ మల్లేశ్, ఎస్సై సంజీవ్, పంచా యతీ కార్యదర్శి శివారెడ్డి తదితరులున్నారు.


