పార్టీని బలోపేతం చేయాలి
బూత్‌స్థాయి నుంచి
నిర్మల్‌చైన్‌గేట్: కాంగ్రెస్ పార్టీని బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేయాలని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భవాని అన్నారు. జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు అలకలాంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ జిల్లాలోని 90,026 బూత్‌లలో కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. మారుమూల గ్రామల్లో సైతం కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. నిర్మల్, కడెం, ఖానాపూర్ తదితర మండలాల్లో బూత్ కమిటీలు పూర్తయ్యాయని తెలిపారు. త్వరలో మిగతా కమిటీలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్‌ను నిర్మాణం చేస్తామన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అపర్ణ, కార్యదర్శి మౌనిక, జిల్లా నాయకులు సుశీల, వసంత, సంగీత, నుస్రత్ బేగం పాల్గొన్నారు.
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భవాని


