కొత్త ఆవిష్కరణలు చేయాలి
నిర్మల్ రూరల్: కొత్తకొత్త ఆవిష్కరణ చేస్తూ విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక సదస్సు(సైన్స్‌ఫేర్)ను డీఈవో భోజన్నతో కలిసి ప్రారంభించారు. సైన్స్ మన జీవితంలో భాగం అన్నారు. సైన్స్ వెనక సైంటిఫిక్ సూత్రం దాగిఉందన్నారు. వీటిని విద్యార్థులు గ్రహించి వినియోగించుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రయోగాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. విద్యార్థులు దైనందిక జీవితంలో చేసే అంశాలపై ఆలోచన చేయాలన్నా రు. ఉపాధ్యాయులు, విద్యార్థులను ప్రయోగం వై పు తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులలోని సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీయాలన్నారు. డీఈ వో భోజన్న మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఆలో చన విధానం, క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలన్నారు. సైన్స్‌ఫేర్‌కు మొత్తం 843 ప్రదర్శనలు వచ్చాయన్నారు. ఇందులో 724 సైన్స్ ఫెయిర్ , 119 ఇన్‌స్పైర్‌కు వచ్చాయి. అనంతరం అదనపు కలెక్టర్, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రారంభంలో సోఫీనగర్ గురుకులం, నిర్మల్ కేజీబీ వీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి, జిల్లా సైన్స్ అధికారి వినోద్‌కుమార్, సెక్టోరియల్ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కొత్త ఆవిష్కరణలు చేయాలి


