డీ–28 మరమ్మతులకు వినతి
ఖానాపూర్: మండలంలోని రాజూరా, బావాపూర్(ఆర్), సింగాపూర్ గ్రామాల పరిధిలో సరస్వతి కాలువ డిస్టిబ్యూటరీ–28కు మరమ్మతులు చేపట్టాలని హైదరాబాద్ జలసౌధలో చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్‌కు విన్నవించారు. ఆయా గ్రామాల నాయకులు సీఈని సోమవారం కలిశారు. త్వరగా పనులు పూర్తిచేయించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో బాస చిన్నరాజేశ్వర్, పుప్పాల పవన్, ఎరికారి శంకర్, బొంగురాల ప్రభాకర్, పొలాస హరీశ్, పులి దేవర, చెవుల సాంబయ్య, ఎరికారి రెడ్డి, పటేల్ కండేరావు, తిరుపతి ఉన్నారు.


