మిమిక్రీలో ప్రతిభ
లక్ష్మణచాంద: లక్ష్మణచాంద మండలం రాచాపూర్ మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల విద్యార్థులు మిమిక్రీ పోటీల్లో ప్రతిభ కనబ ర్చారు. తెలంగాణ గురుకులాల సొసైటీ మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేరెళ్ల మాధవ్ జ్ఞాపకార్థం హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో పోటీలు నిర్వహించారు. ఇందులో రాచాపూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యార్థులు అక్షయ్, శివకృష్ణ పాల్గొని ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు. ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. వీరికి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సర్టిఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయుడు నాగరాజు పాల్గొన్నారు.


